Sat Dec 13 2025 22:31:08 GMT+0000 (Coordinated Universal Time)
Kurnool Bus Accident : కావేరి ట్రావెల్స్ కీలక నిర్ణయం
రోడ్డు ప్రమాదం నేపథ్యంలో కావేరి ట్రావెల్స్ కీలక నిర్ణయం తీసుకుంది

కావేరి ట్రావెల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో లోపల ఉన్న ప్రయాణికులు బయటకు రాలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
కార్యాలయాన్నింటినీ...
హైదరాబాద్లోని తమ కార్యాలయాలన్నింటినీ మూసివేసింది. ఘటన జరిగినప్పటి నుంచి యాజమాన్యం అందుబాటులోకి రాలేదు. ఈ బస్సులో హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కారు.కొందరు ప్రయాణికుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కావేరి ట్రావెల్స్ తమ కార్యాలయాన్ని మూసివేయడంతో సమాచారం ఇచ్చేవారు ఎవరూ లేరు.
Next Story

