Sun Mar 15 2026 10:23:03 GMT+0530 (India Standard Time)
YCP : వైసీపీకి రాజీనామా చేసిన ఒంటేరు
వైసీపీకి కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు

వైసీపీకి కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. 1999 లో కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒంటేరు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ఆయన రాజకీయంగా పెద్దగా ఎదగలేకపోయారు. అయితే 2014లో వైసీపీలో చేరిన ఆయన పార్టీలో అసంతృప్తిగానే ఉన్నారు. ఆయన తనకు రాజకీయంగా జగన్ మరోసారి అవకాశమిస్తారని భావించారు.
పదేళ్ల నుంచి...
కానీ పదేళ్ల నుంచి తనకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదని, వైసీపీలో ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేశానని ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అందుకే పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలో ప్రకటిస్తానని ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఆయన టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Next Story

