Mon Jan 20 2025 08:41:53 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ నేత అయినా?
కారుమూరు నాగేశ్వరరావుకు లక్కీగా మంత్రి పదవి లభించిందనే చెప్పాలి.
![karumuru nageswararao, minister, new cabinet, andhra pradesh karumuru nageswararao, minister, new cabinet, andhra pradesh](https://www.telugupost.com/h-upload/2022/04/11/1348120-karumuru-nageswararao-minister-new-cabinet-andhra-pradesh.webp)
కారుమూరు నాగేశ్వరరావుకు లక్కీగా మంత్రి పదవి లభించిందనే చెప్పాలి. నిజంగా ఆయన సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కారుమూరినే జగన్ ఎంపిక చేశారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్ గా పనిచేశారు. తర్వాత 2009లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తణుకు నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో ఆయనకు వైసీపీ అధినాయకత్వం తణుకు టిక్కెట్ ఇవ్వడంతో విజయం సాధించారు. ఆయనను మంత్రిగా ఎంపిక చేస్తారని ఆయన అనుచరులు సయితం ఊహించలేదు.
Next Story