Sat Dec 06 2025 17:41:57 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీశైలంలో ఆరోజుల్లో స్పర్శ దర్శనం రద్దు
శ్రీశైలంలో ఈ నెల 26వ తేదీ వచ్చే నెల 23వ తేదీ వరకూ కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి

శ్రీశైలంలో ఈ నెల 26వ తేదీ వచ్చే నెల 23వ తేదీ వరకూ కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో లవనన తెలిపారు. నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఉదయం 6.30 గంటలకు ఆలయం మూసివేస్తామని చెప్పారు. కార్తిక సోమవారాల్లో, సెలవు రోజుల్లో స్పర్శదర్శనం రద్దు చేస్తామని ఆయన తెలిపారు.
కార్తీక మాసంలో...
ఇక శ్రీశైలంలో సేవా టిక్కెట్ల ధరలను పెంచలేదని లవన్న పేర్కొన్నారు. భక్తులకు కార్తీక మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆదివారాలతో పాటు కార్తీక సోమవారాలు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావించి ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Next Story

