Wed Mar 04 2026 14:50:27 GMT+0530 (India Standard Time)
జగన్ మెచ్చుకున్న యువకుడు ఈయనే
దుర్గగుడి ఛైర్మన్ గా కర్నాటి రాంబాబును ఇటీవల ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనితీరుపై జగన్ ప్రశంసలు కురిపించారు

అతి కొద్ది సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ దృష్ఠిలో ఆ యువకుడికి సముచిత స్థానం లభించింది. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నావంటూ జగన్ స్వయంగా ప్రశంసిచండం ఇదే తొలి సారి కావచ్చు. దుర్గగుడి ఛైర్మన్ గా కర్నాటి రాంబాబును ఇటీవల ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనితీరుపై జగన్ ప్రశంసలు కురిపించారు. ఆలయ ప్రక్షాళనకు చేపడుతున్న చర్యలపై జగన్ ప్రశంసించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నావంటూ కర్నాటి రాంబాబుకే జగన్ చెప్పడంతో చుట్టుపక్కల నేతలు కూడా ఒకింత ఆశ్చర్యపోయారు.
సామాన్య భక్తుల కోసం...
సామాన్య భక్తుల కోసం విస్తృత సదుపాయాలు కల్పించేందుకు చేస్తున్న కృషి, ఆలయంలో చేస్తున్న ఆకస్మిక తనిఖీలు బాగున్నాయని జగన్ కితాబిచ్చారు. దుర్గగుడి ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కర్నాటి రాంబాబు చేస్తున్న ధార్మిక సేవా కార్యక్రమాలను జగన్ ప్రశంసించారు. దుర్గగుడి అభివృద్ధికి ప్రభుత్వం 70 కోట్ల రూపాయలను కేటాయించిందని, సామాన్య భక్తులకు దుర్గమ్మ దర్శనం అందుబాటులో ఉండేలా చూడాలని జగన్ కర్నాటిని ఆదేశించారు.
Next Story

