Thu Mar 19 2026 20:51:39 GMT+0530 (India Standard Time)
శ్రీశైలంలో కర్ణాటక సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఆయన అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి బొమ్మై కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్సీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన శ్రీశైలం బయలుదేరి వెళ్లనున్నారు.
స్వామి వారిని దర్శించుకుని...
శ్రీశైలంలో ఆయన మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి బెంగళూరు బయలుదేరి వెళతారు. కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీశైలం వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేద మంత్రాలతో ఆయన స్వాగతం పలికనున్నారు.
Next Story

