Mon Dec 15 2025 07:24:00 GMT+0000 (Coordinated Universal Time)
వీరసింహారెడ్డికి కాపునాడు వార్నింగ్
సినీనటుడు నందమూరి బాలకృష్ణకు కాపునాడు అల్టిమేటం ఇచ్చింది. ఈ నెల 25వ తేదీ లోపు క్షమాపణలు చెప్పాలని కోరింది.

సినీనటుడు నందమూరి బాలకృష్ణకు కాపునాడు అల్టిమేటం ఇచ్చింది. ఈ నెల 25వ తేదీ లోపు క్షమాపణలు చెప్పాలని కోరింది. ఎస్వీ రంగారావుపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. ఆ రంగారావు.. ఈ రంగారావు అంటూ ఒక మహానటుడిని పట్టుకుని బాలకృష్ణ వెటకారంగా మాట్లాడమేంటని ప్రశ్నించింది.
క్షమాపణలు చెప్పకుంటే...
క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీరంగారావులను చులకనగా మాట్లాడుతూ ఉన్న వీడియలో వైరల్ కావడంతో కాపునాడు దీనిపై స్పందించింది.
Next Story

