Fri Jan 17 2025 20:32:02 GMT+0000 (Coordinated Universal Time)
కొత్తపల్లిని కలిసిన...ముద్రగడ... అందుకేనా?
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడితో భేటీ అయ్యారు.
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడితో భేటీ అయ్యారు. నరసాపురానికి వచ్చిన ముద్రగడ నేరుగా కొత్తపల్లి వద్దకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాపు సామాజికవర్గంలో ముద్రగడకు పెద్దన్నగా ముద్ర ఉంది.
రాజకీయ ప్రాధాన్యత....
ఇటీవల కొత్తపల్లి సుబ్బరాయుడిని వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. కొత్తపల్లి సుబ్బరాయుడు తాను ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. నరసాపురం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని కూడా చెప్పారు. ఆయన తిరిగి టీడీపీలోకి వెళతారా? జనసేనలోకి వెళతారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం కొత్తపల్లి సుబ్బారాయుడిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story