Sun Mar 08 2026 06:33:59 GMT+0530 (India Standard Time)
Breaking Mudragada Padmanabam : వైసీపీలో చేరిన ముద్రగడ.. దశాబ్దకాలం తర్వాత మెడలో పార్టీ కండువా
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు

Mudragada Padmanabam :కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ముద్రగడను పార్టీలోకి సాదరంగా జగన్ ఆహ్వానించారు. వైసీపీ కండువా కప్పిన జగన్ ముద్రగడను ఆలింగనం చేసుకున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు.
సాదరంగా ఆహ్వానించి...
మాజీ మంత్రి కన్నబాబు తదితరులు వెంటరాగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి జగన్ ఆహ్వానించారు. పార్టీ అన్ని రకాలుగా రాజకీయంగా అండదండలుగా ఉంటుందని ఈ సందర్భంగా ముద్రగడకు వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం తాను పనిచేస్తానని కూడా ముద్రగడ ఈ సందర్భంగా తెలిపారు.
Next Story

