Sun Dec 08 2024 10:24:33 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సంచలన లేఖ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడిగి ఉండాల్సిందని అన్నారు. ఆ సాహసం మీరు చేయకపోవడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి మీరే కారకులు అని తెలిపారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదు, రాకూడదని దేవుని కోరుకుంటున్నానని ముద్రగడ లేఖలో వివరించారు.
చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడరు బయటకు రావడానికి భయపడి ఇళ్ళకే పరిమితం అయిపోయారన్నారు. అటువంటి కష్టకాలంలో జైలుకి వెళ్ళి వారికి భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదన్నారు. చరిత్ర తిరగరాసినట్టు అయ్యింది. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనన్నారు. ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మలను ఉన్నత స్థానంలో చూడాలని తహతహాలాడారన్నారు.
Next Story