Fri Mar 13 2026 19:10:27 GMT+0530 (India Standard Time)
అన్నదాత సుఖీభవ పధకం ఓ దగా
అన్నదాత సుఖీభవ పధకంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీమంత్రి కన్నబాబు అన్నారు

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత నిధులపై కూటమి ప్రభత్వం చెబుతున్నవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ నిధుల్ని పూర్తిగా ఎగ్గొట్టిన ప్రభుత్వం, రెండో ఏడాది రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు మూడో విడతలోనూ ఏడు లక్షల రెతులకు పథకంలో కోత పెట్టారని తప్పుబట్టారు. ఇప్పటికే గిట్టుబాటు ధరల్లేక, ఇన్పుట్ సబ్సిడీ అందక, ఉచిత పంటల బీమా లేక దిక్కుతోచక రైతులు చివరకు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని కాకినాడలో మీడియాతో మాట్లాడిన కె.కన్నబాబు ఆక్షేపించారు.
మరో మోసం...
చంద్రబాబు ఏ ఒక్క రోజు కూడా నిజం చెప్పకుండా, ఒక్క రోజు కూడా తనను తాను సీనియార్టీని గుర్తు చేసుకుని ప్రజల కోసం స్వచ్ఛందంగా, నిజాయితీగా నిలబడాలనే ఆలోచన లేకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ ఉగాది కానుక అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రెండు వేలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4 వేలు ఇస్తోందని చెప్పుకున్నారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున ఇస్తే, అంతకన్నా ఎక్కువగా, కేంద్రం ఇచ్చేది కాకుండా, స్వయంగా రూ.20 వేల చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్‌లో జోరుగా ప్రచారం చేసుకున్నారు. కానీ తొలి ఏడాది మొత్తానికి మంగళం పాడారు. రెండో ఏడాది కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత నిధుల్లోనూ పచ్చి అబద్ధాలు చెబుతూ, ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని కన్నబాబు ఆరోపించారు.
Next Story

