Thu Mar 19 2026 10:06:34 GMT+0530 (India Standard Time)
Breaking : బాబు కళ్లల్లో మెరుపులు : కన్నా చేరికతో
కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు

సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. సరిగ్గా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 2.48 గంటలకు కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కళ్లల్లో మెరుపులు కనిపించాయి. గుంటూరు నుంచి భారీ ర్యాలీగా వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాగానే ఆయనకు చంద్రబాబు స్వాగతం పలికారు.
ఆయన అనుచరులు...
కన్నా లక్ష్మీనారాయణతో పాటు మూడు వేల మంది వరకూ ఆయన అనుచరులు పార్టీలో చేరిపోయారు. అందులో ముఖ్యమైన నేతలు యాభై మందికి చంద్రబాబు కండువా కప్పారు. కన్నా రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ సేవలను పార్టీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. ఆయన అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని చంద్రబాబు అన్నారు.
Next Story

