Sun Mar 08 2026 01:47:49 GMT+0530 (India Standard Time)
వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత
కల్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నేత ఉమామహేశ్వర నాయుడు వైసీపీలో చేరారు.

కల్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నేత ఉమామహేశ్వర నాయుడు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన కండువా కప్పుకున్నారు. వైసీపీ అధినేత జగన్ పత్తికొండ నియోజకవర్గంలో రాత్రి బస చేశారు. అక్కడి నుంచి ఆయన అనంతపురం జిల్లాలోకి వస్తున్నారు. గుత్తికి వచ్చిన ఉమామహేశ్వరనాయుడు తన వర్గీయులతో కలసి వైసీపీలో చేరారు.
టీడీపీ ఇన్ఛార్జిగా...
ఉమామహేశ్వరనాయుడు ప్రస్తుతం కల్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. టిక్కెట్ తనకు వస్తుందని భావించిన ఆయన అది దక్కకపోవడంతో పార్టీ తనను మోసం చేసిందని చెబుతూ వైసీపీలో చేరారు. కల్యాణదుర్గంలో వైసీపీ గెలుపు కోసం తాను ప్రయత్నిస్తానని ఉమామహేశ్వర నాయుడు తెలిపారు.
Next Story

