Fri Dec 05 2025 10:26:53 GMT+0000 (Coordinated Universal Time)
Kakani : పార్టీ మారినోళ్లంతా వైసీపీ కోవర్టులేనా?
చంద్రబాబు ప్రభుత్వంపై కాకాణి గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన వాళ్లంతా వైసీపీ కోవర్టులేనా? అని ఆయన ప్రశ్నించారు. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి పార్ధసారధి వీరంతా వైసీపీ కోవర్టులుగానే భావిస్తున్నారా? అని కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ మారిన వారికి టిక్కెట్లు ఇచ్చినప్పటికీ వారు చేసిన నేరాలు బయటపడిన వెంటనే రాజకీయ బురద చల్లేందుకు వైసీపీ కోవర్టులుగా ముద్ర వేస్తూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వం అండతో...
నెల్లూరు లో జరిగిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ తంబళ్లపల్లి ములకలచెరువులో కల్తీ మద్యం తయారు చేస్తున్నది ఎవరి కాలంలో అని కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం అండతోనే ఈ కల్తీ మద్యం తయారవుతుందన్న విషయం ప్రజలందరికీ తెలిసిందన్నారు. ప్రభుత్వం అండ లేకుండా ఎంత ధైర్యం లేకపోతే పెద్ద తయారీ పరిశ్రమను నెలకొల్పుతారనికాకాణి గోవర్థన్ రెడ్డి నిలదీశారు. కల్తీ మద్యం కేసు అనుకోకుండా బయటపడటంతో తామే దానిని బయటకు తెచ్చామని చెప్పుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని, కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కాకాణి గోవర్థన్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేశారు. జయచంద్రారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిందెవరని కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story

