Sat Mar 07 2026 21:55:30 GMT+0530 (India Standard Time)
నేడు సీబీఐ ఎదుటకు అవినాష్ రెడ్డి
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల విచారణకు హాజరుకానున్నారు

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఆయన విచారణ జరగనుంది. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హాజరవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు.
విచారణకు హాజరు కావాలని...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంభదించి నాలుగోసారి అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే తనను అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి వేసిన పిటీషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కేసులో సాక్షిగానే విచారిస్తున్నామని సీబీఐ కోర్టుకు తెలిపింది.
Next Story

