Mon Mar 16 2026 08:47:11 GMT+0530 (India Standard Time)
విచారణకు రాలేనన్న వైెఎస్ అవినాష్ రెడ్డి
సీబీఐ విచారణకు తాను హాజరుకాలేనని కడప ఎంపీ వైెఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు

సీబీఐ విచారణకు తాను హాజరుకాలేనని కడప ఎంపీ వైెఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున తాను విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తనకు మధ్యంతర బెయిల్ కావాలంటూ హైకోర్టులో వైెఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటీషన్ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున తాను విచారణకు రాలేనని ఆయన చెప్పినట్లు తెలిసింది.
కేసులు పెండింగ్లో...
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాలని వైెఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యాహ్నం విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని వైెఎస్ అవినాష్ రెడ్డి చెప్పడంతో ఇప్పుడు సీబీఐ అధికారులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

