Sun Dec 14 2025 19:29:26 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. నాలుగోసారి సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు. తనకు పార్లమెంటు సమావేశాలున్నాయని, విచారణకు మినహాయింపు ఇవ్వాలని నిన్న అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. అయితే సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆయన విచారణకు హాజరయ్యారు.
భారీ బందోబస్తు...
అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా కోఠిలోని సీీబీఐ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు పెద్దయెత్తున అక్కడ గుమికూడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతం నుంచి వారిని పంపించి వేస్తున్నారు. తనను అరెస్ట్ చేయవద్దంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
Next Story

