Sat Mar 07 2026 21:55:43 GMT+0530 (India Standard Time)
ఐదోసారి విచారణకు అవినాష్ రెడ్డి
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరోసారి విచారించనున్నారు

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు మరోసారి విచారించనున్నారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే అవినాష్ రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆయన ఈరోజు కోఠిలోని సీబీఐ కార్యాలయం ఎదుట విచారణకు హాజరు కానున్నారు.
ఐదోసారి...
వైఎస్ వివేకానందరెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు విచారించారు. అయిదో విచారణకు సిద్ధమయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సాక్షిగానే అవినాష్ రెడ్డిని విచారిస్తున్నామని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి తెలియజేశారు. తనను అరెస్ట్ చేయవద్దంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయిదే వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Next Story

