Sat Mar 07 2026 21:57:51 GMT+0530 (India Standard Time)
నేడు ఎంపీ అవినాష్ హాజరవుతారా?
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు ఆయనకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ జరిపేందుకు నోటీసులు జారీ చేశారు. 160 కింద సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయడంతో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు.
నేడు విచారణ...
అయితే దీనిపై హైకోర్టులో ఇంకా విచారణ జరగలేదు. హైకోర్టులో పిటీషన్ పెండింగ్ ఉన్నందున తాను హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి మరింత సమయం కోరే అవకాశముందని తెలుస్తోంది. నేడు హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటీషన్ పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐ అధికారుల ఎదుటకు విచారణ నిమిత్తం హాజరవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

