Sat Mar 07 2026 20:27:05 GMT+0530 (India Standard Time)
సుప్రీంకోర్టుకు వైఎస్ అవినాష్ రెడ్డి
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన కోరారు

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన కోర్టుకు వెళ్లారు. వాస్తవానికి వైఎస్ అవినాష్ రెడ్డి నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో రాలేకపోతున్నానని, తనకు నాలుగు రోజులు సమయం కావాలని ఆయన సీబీఐ అధికారులను ఆన్లైన్ ద్వారా కోరారు.
వెకేషన్ బెంచ్ వెంటనే...
దీనికి స్పందించిన సీీబీఐ అధికారులు ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని కోరారు. వైఎస్ అవినాష్ రెడ్డిని ఎనిమిదోసారి విచారించాలని సీబీఐ అధికారులు నిర్ణయించి సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయితే నిన్న విచారణకు తనకు సమయం కావాలని కోరిన వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెకేషన్ బెంచ్ విచారణను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, వెంటనే తన ముందస్తు బెయిల్పై హైకోర్టు నిర్ణయం చెప్పాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.
Next Story

