Sun Mar 08 2026 00:33:54 GMT+0530 (India Standard Time)
జస్టిస్ చంద్రు కామెంట్స్ వెనక వైసీపీ
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఖండించారు

జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను వైసీపీ రెబల్ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఖండించారు. న్యాయస్థానాలను తప్పుపట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను, తీసుకుంటున్న నిర్ణయాలను తెలుసుకోకుండా జస్టిస్ చంద్రు న్యాయస్థానాలపై నిందలు వేయడం సరికాదని అన్నారు.
న్యాయస్థానాలపైనే నిందలా...?
జస్టిస్ చంద్రు వ్యాఖ్యల వెనక వైసీపీ కుట్ర దాగి ఉండవచ్చని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్లనే అనేక కేసులు కోర్టుల్లో వీగిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజు గుర్తు చేశారు. మూడు రాజధానుల బిల్లులు వెనక్కు తీసుకోవడానికి ప్రధాన కారణం ఆ బిల్లుల్లో లోపాలుండటమేనని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ సయితం అంగీకరించారన్నారు.
Next Story

