Fri Dec 05 2025 15:20:42 GMT+0000 (Coordinated Universal Time)
వారాహి యాత్రలో "జూనియర్" ఫ్లెక్సీల కలకలం
వారాహి యాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కలకలం రేపాయి. కాసేపట్లో పెడనలో వారాహి యాత్ర చేరుకుంటుంది.

వారాహి యాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కలకలం రేపాయి. కాసేపట్లో పెడనలో వారాహి యాత్ర చేరుకుంటుంది. పవన్ కల్యాణ్ బహిరంగ సభ జరగనుంది. టీడీపీ జనసేన పొత్తు ప్రకటన తర్వాత వారాహి యాత్రలో పాల్గొనాలని టీడీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పెడన సభలో రాళ్లదాడి జరిగి అల్లర్లు సృష్టించడానికి కొన్ని అరాచక శక్తులు ప్రయత్నిస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
ఫ్యాన్స్, కార్యకర్తల మధ్య...
అయితే రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కొంత కలకలం సృష్టిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు సీఎం పదవి ఇవ్వాలంటూ ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మాస్ అమ్మ మొగుడు అంటూ ఎన్టీఆర్ ఫొటోతో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు పెట్టారు. పోస్టర్‌కు ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్, మరో వైపు పవన్ ఫొటో పెట్టి ప్రదర్శిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ చోటు చేసుకునే అవకాశముందని భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు.
Next Story

