Sun Mar 08 2026 15:24:54 GMT+0530 (India Standard Time)
నిలకడగానే ఉంది కానీ.. క్రిటికల్ కండిషనే
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తారకరత్నను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లడారు.

తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తారకరత్నను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లడారు. నిలకడగానే ఉంది కాని, క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చినట్లు కాదని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందుతుందని చెప్పారు.
వైద్యులందరూ...
వైద్యులు అందరూ తారకరత్న ఆరోగ్యం మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రేపు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, పరీక్షల ఫలితాలను బట్టి తదుపరి చికిత్స చేస్తామని వైద్యులు చెప్పినట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. వైద్యానికి తారకరత్న స్పందిస్తున్నారని, అభిమానుల ఆశీస్సులు, దీవెనలు తారకరత్నకు కావాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు.
Next Story

