Thu Mar 19 2026 08:35:03 GMT+0530 (India Standard Time)
Ys Jagan : జగన్ సభలో జూనియర్ ఫ్లెక్సీలు... జై ఎన్టీఆర్ అంటూ
కర్నూలులో జరిగిన జగన్ సభలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ జెండాలతో ఫ్యాన్స్ సందడి చేశారు

నిన్న మొన్నటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, పోస్టర్లు చంద్రబాబు సభల్లో కనిపించేవి. తెలుగుదేశం పార్టీ అభిమానులుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో సీఎం అవ్వాలని కోరుకుంటారు. అదీ తెలుగుదేశం పార్టీ నుంచే అని అందరూ భావిస్తారు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్లెక్సీలు, కటౌట్ లు జగన్ సభలో కనిపించాయి.
రాజకీయాలలో తమ హీరో...
కర్నూలులో జరిగిన జగన్ సభలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ జెండాలతో ఫ్యాన్స్ సందడి చేశారు. తమకు సినిమాల్లో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అయితే రాజకీయాల్లో మాత్రం జగన్ అంటూ నినాదాలు చేయడం వినిపించింది. గతంలో ఎక్కడా లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు జగన్ సభలో కనిపించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.
Next Story

