Mon Dec 15 2025 10:23:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బెంగళూరుకు జూనియర్ ఎన్టీఆర్
తారకరత్నను పరామర్శించేందుకు నేడు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ రానున్నారు

తారకరత్నను పరామర్శించేందుకు నేడు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ రానున్నారు. ప్రత్యేక విమానంలో బయలుదేరి వారు నేరుగా బెంగళూరుకు చేరుకోనున్నారు. తారకరత్న ఇటీవల లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురై నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతి తెలిసిందే.
ఆరోగ్య పరిస్థితి....
అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఇప్పటికే కుటుంబ సభ్యులు బెంగళూరుకు వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిన్న పరామర్శించారు. వైద్యులను అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. సోమవారం మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు చెప్పారని మాజీ మంత్రి కేంద్ర మంత్రి పురంద్రీశ్వరి తెలిపారు. తారకరత్న కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Next Story

