Thu Mar 19 2026 07:21:37 GMT+0530 (India Standard Time)
బెంగుళూరులో జూనియర్ ఎన్టీఆర్
నారాయణ హృదయాలయ ఆసుపత్రికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చేరుకున్నారు

నారాయణ హృదయాలయ ఆసుపత్రికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చేరుకున్నారు. తారకరత్న ను పరామర్శించేందుకు ఆయన బెంగళూరు వచ్చారు. ప్రత్యేక విమానంలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను కర్ణాటక మంత్రి స్వాగతం పలికారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన సతీమణి కూడా వచ్చారు.
కొంత నిలకడగా...
తారకరత్న ఆరోగ్యపరిస్థితి కొంత మెరుగ్గా ఉందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా చికిత్స కొనసాగుతుంది. కుప్పం ఆసుపత్రి కంటే ఇప్పుడు మెరుగ్గా ఉందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తారకరత్నను శివరాజ్ కుమార్ కూడా పరామర్శించారు.
Next Story

