Mon Mar 16 2026 01:26:31 GMT+0530 (India Standard Time)
ఏపీలో జూనియర్ డాక్టర్ల మెరుపు సమ్మె
ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగినట్లు అసోసియేషన్ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగినట్లు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. రెండు రోజుల క్రితం గుంటూరులో రోగి బంధువులు డాక్టర్ పై దాడికి దిగారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిినా ఫలితం లేదు. దీంతో జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు సమ్మెకు దిగారు.
ఓపీ సేవలను....
డాక్టర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నుంచి అవుట్ పేషెంట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకపోతే ఎమర్జెన్సీ సేవలను కూడా బంద్ చేస్తామని వారు హెచ్చరించారు.
Next Story

