Sun Mar 15 2026 12:54:41 GMT+0530 (India Standard Time)
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ కళాశాలలు జూన్ ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో జూనియర్ కళాశాలలు జూన్ ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. 2023-2024 అకడమిక్ క్యాలెండర్ ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఫలితాలు వెలువడటంతో కళాశాలల ప్రారంభ తేదీని, అకడమిక్ క్యాలెండర్ ను కూడా విద్యాశాఖ వెల్లడించింది.
సెలవులు ఇవే...
అక్టోబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుంటాయని, జనవరి 19 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
Next Story

