Sun Dec 08 2024 21:24:22 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు తేలిపోనుందా?
ఈరోజు అనేక కేసులకు సంబంధించి తీర్పులు వెలువడనున్నాయి. మరికొన్ని కేసుల్లో విచారణ ప్రారంభం కానుంది.
ఈరోజు అనేక కేసులకు సంబంధించి తీర్పులు వెలువడనున్నాయి. మరికొన్ని కేసుల్లో విచారణ ప్రారంభం కానుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. అదే సమయంలో స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో సీఐడీ కస్టడీ పిటీషన్ పై కూడా నేడు న్యాయస్థానం విచారణ చేయనుంది. ఈ రెండు పిటీషన్లపై విచారణ జరిపి నేడు ఉత్తర్వులనను న్యాయస్థానం జారీ చేయనుంది. సీఐడీ తమకు చంద్రబాబును ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని మళ్లీ కోరింది. తొలి రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించలేదని, అందువల్ల కస్టడీకి ఇవ్వాలని కోరంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో...
అలాగే ఈరోజు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ నేడు విచారణ జరగనుంది. ఈరోజు ఈ కేసు విచారణను చేపట్టనుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై కూడా నేడు విచారణ జరగనుంది.
సుప్రీంకోర్టులోనూ...
దీంతోపాటు ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐటెమ్ నెంబరు 61గా లిస్ట్ అయింది. తనపై నమోదయిన కేసుల్లో ఎఫ్ఐఆర్, రిమాండ్లను రద్దు చేయాలని ఆయన పిటీషన్లో కోరారు. అవినీతి నిరోధక చట్టంలోని 17ఎ చట్టం తనకు వర్తించదని చంద్రబాబు తరుపున న్యాయవాదులు వాదించనున్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. రాజమండ్రి జైలుకు వెళ్లి ఇప్పటికే చంద్రబాబు పద్దెనిమిది రోజులు పూర్తి కావడంతో ఆయన తరుపున న్యాయవాదులు ఎలాగైనా ఈ క్వాష్ పిటీషన్ ను క్రాష్ చేయించాలని భావిస్తున్నారు. అందుకే ఈరోజు చంద్రబాబుకు బిగ్ డే అని చెప్పాలి.
Next Story