Wed Dec 17 2025 11:43:42 GMT+0000 (Coordinated Universal Time)
AP Politics : నేడు మూడు పార్టీల ఉమ్మడి సమావేశం
నేడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనల నేతల ఉమ్మడి సమావేశం విజయవాడలో జరగనుంది

నేడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనల నేతల ఉమ్మడి సమావేశం విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాట్లతో పాటు ఏ ఏ సీట్లలో పోటీ చేయాలన్న దానిపై మూడు పార్టీల నేతలు చర్చించనున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్లు విజయవాడలో ఉన్నారు. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరు కానున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆయన విజయవాడకు చేరుకోనున్నారు.
అందుకే కీలకం...
నిన్ననే పవన్ కల్యాణ్ గజేంద్ర షెకావత్ ను కలసి సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించారు. మూడు పార్టీల మధ్య అధికారిక పొత్తు కుదురడంతో ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రాధమికంగా బీజేపీ, జనసేనలు ఎనిమిది పార్లమెంటు స్థానాల్లోనూ, 30 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే ఏ ఏ సీట్లలో పోటీ చేయాలన్న దానిపై నేడు మూడు పార్టీల అగ్రనేతలు చర్చించనున్నారు. దీంతో ఈ సమావేశం కీలకంగా మారనుంది.
Next Story

