Sun Feb 01 2026 04:43:15 GMT+0000 (Coordinated Universal Time)
బొత్స కాళ్లు మొక్కిన జాయింట్ కలెక్టర్
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లమీద పడ్డారు.

విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లమీద పడ్డారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే సమయంలో ఈ ఘటన జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణకు శుభాకాంక్షలు చెబుతూ జేసీ కిషోర్ కుమార్ ఆయన కాళ్ల మీద పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెల్లువెత్తుతున్న విమర్శలు....
జాయింట్ కలెక్టర్ హోదాలో కిషోర్ కుమార్ బొత్స సత్యనారాయణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చారు. బొకే ఇచ్చిన అనంతరం బొత్స సత్యనారాయణ కాళ్లకు నమస్కారం పెట్టారు. ఉన్నతాధికారులు ఒక మంత్రి కాళ్లు మొక్కడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
Next Story

