Fri Mar 27 2026 19:37:16 GMT+0530 (India Standard Time)
టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీలో చేరికలు మొదలయ్యాయి. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య టీడీపీలో చేరారు

తెలుగుదేశం పార్టీలో చేరికలు మొదలయ్యాయి. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో మునిరామయ్యతో పాటు ఆయన కుమారుడు ప్రవీణ్ కూడా టీడీపీలో చేరారు. ఇద్దరికీ తెలుగుదేశం కండువాలు కప్పిం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.
1985లో గెలిచి....
1985లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మునిరామయ్య ఆ తర్వాత టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మునిరామయ్య ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. తాజాగా ఆయన తన కుమారుడితో కలసి టీడీపీలో చేరారు.
- Tags
- muniramayya
- tdp
Next Story

