Sun Sep 15 2024 01:16:13 GMT+0000 (Coordinated Universal Time)
TDP : విశాఖ వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు
తెలుగుదేశం పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది.
తెలుగుదేశం పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఇన్ఛార్జి అక్కరమాని విజయనిర్మల ఆ పార్టీని వీడారు. ఈరోజు ఉండవల్లి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
గతంలో వైసీపీలో...
అక్కరమాని విజయనిర్మల గతంలో విశాఖ వీఎంఆర్డీఏ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ వైసీపీ అధినాయకత్వం ఇవ్వలేదు. దీంతో అసంతృప్తికి గురైన అక్కరమాని విజయనిర్మల, ఆమె భర్త వెంకట్రావు టీడీపీలో చేరారు. వీరితో పాటు మాజీ ఎంపీీపీ గోపిరాజు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.
Next Story