Thu Dec 18 2025 05:15:28 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త
తెలుగుదేశం పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉండటంతో అధినాయకత్వం కూడా చేరికలను ప్రోత్సహిస్తుంది.

తెలుగుదేశం పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉండటంతో అధినాయకత్వం కూడా చేరికలను ప్రోత్సహిస్తుంది. ప్రధానంగా టీడీపీని పార్లమెంటు సభ్యుల అభ్యర్థుల కొరత పట్టి పీడిస్తుంది. దీనిని అధిగమించేందుకు పారిశ్రామికవేత్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా రాయలసీమకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి టీడీపీలో చేరారు. ఆయన బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.
రాజంపేట ఎంపీ అభ్యర్థిగా...
గంటా నరహరిని సాదరంగా చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. దివంగత ఎపీ డీకే ఆదికేశవులునాయుడికి నరహరి సమీప బంధువు. రాజంపేట లోక్సభ స్థానానికి నరహరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Next Story

