Sat Mar 07 2026 20:28:13 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడు మంగళగిరిలో జాబ్ మేళా
ఈరోజు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

ఈరోజు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి జరగనున్న మెగా జాబ్ మేళాలో 5 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 50 కు పైగా కంపెనీలు ముందుకు వచ్చినట్లు నిర్వహకులు తెలిపారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన వారు, ఇంటర్, డిప్లమా, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగిన యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అర్హత కలిగిన వారు...
24వ తేదీన మంగళగిరి ఉదయం 10 గంటల కల్లా బయోడేటా ఫామ్‌తో పాటు జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. జాబ్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాలకు 9642333668, 9030047303, హెచ్ఆర్ 8886111981 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు https://forms.gle/qWTz5ZiDJXMXkBCV6 వెబ్ సైట్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులందరికీ ఉపాధి మార్గాలను చూపించడం కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వారు మాత్రమే అర్హులు అన్నారు.
Next Story

