Tue Jan 20 2026 12:47:21 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో రేపు జాబ్ మేళా.. నందిగామలో ఇంటర్వ్యూలు !
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ.. అనగా సోమవారం భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఈ మేరకు APSSDC ప్రకటన విడుదల చేసింది.

ఏపీలో నిరుద్యోగులకు APSSDC శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ.. అనగా సోమవారం భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఈ మేరకు APSSDC ప్రకటన విడుదల చేసింది. కృష్ణాజిల్లాలోని నందిగాలో నిర్వహించే ఈ జాబ్ మేళాలో వరుణ్ మోటార్స్, మీషూ, కెస్ కార్పొరేషన్ లిమిటెడ్, డీమార్ట్ వంటి సంస్థలు నియామకాలు చేపట్టనున్నాయి.
అర్హత, ఆసక్తి కల అభ్యర్థులు తమ రెజూమ్ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్సు కాపీలు, పాస్పోర్టు సైజ్ ఫోటోలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు. నందిగామలోని ఎంఆర్ఆర్ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో జరిగే ఈ జాబ్ మేళాకు 18 నుంచి 30 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు హాజరు కావొచ్చని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 90149 43757, 99888 53335 నంబర్లను సంప్రదించాలని APSSDC విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Next Story

