Sat Dec 06 2025 03:16:11 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 21న తిరుపతిలో జనవాణి
ఈ నెల 21వ తేదీన తిరుపతిలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

జనసేన జనవాణి కార్యక్రమం తిరిగి ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీన తిరుపతిలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 21వ తేదీన తిరుపతిలోని జీవీఆర్ కన్వెన్షన్ హాలులో ఉదయం పది గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఐదు జిల్లాలకు...
రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల ప్రజలు తమ సమస్యలపై పవన్ కల్యాణ్ కు వినతిపత్రాలు ఇవ్వవచ్చు. ఆయనే స్వయంగా వినతి పత్రాలను తీసుకుంటారు. ఇప్పటి వరకూ విజయవాడలో రెండుసార్లు, భీమవరంలోనూ జనవాణి కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ నిర్వహించారు. మూడు సార్లు ప్రజల నుంచి భారీగా స్పందన రావడంతో జనవాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
Next Story

