Tue Feb 03 2026 00:41:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : జనసేన దే గెలుపు.. పిఠాపురం కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో జనసేన అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.

పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో జనసేన అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం ఆరు స్థానాలకు ఈరోజు ఎన్నిక జరిగింది. అయితే ఆరు డైరెక్టర్ స్థానాలకు జనసేన పార్టీ మద్దతుతో ముగ్గురు పోటీ చేశారు. పోటీ చేసిన మూడు స్థానాల్లో జనసేన విజయం సాధించడం విశేషం. అంటే ఈ ఎన్నికల్లోనూ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ ను జనసేన నమోదు చేసింది.
మూడు స్థానాలను...
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో కూడా ముగ్గురు బరిలోకి దిగారు. వీరిలో ఇద్దరు మాత్రమే గెలిచారు. మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ సొసొటీని కూటమి పార్టీ సొంతం చేసుకోగా, ఆధిపత్యం మాత్రం జనసేనదే కనిపించింది. మొత్తం 2,111 మంది ఓటర్లుండగా, 901 మంది మాత్రమే ఓటు వేశారు. పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గంలో జనసేన జెండా మరోసారి ఎగిరింది.
Next Story

