Sun Feb 01 2026 21:54:49 GMT+0000 (Coordinated Universal Time)
పులివెందులకు పవన్ కల్యాణ్
ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో జనసేన రైతు భరోసా యాత్ర నిర్వహించనుంది

ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో జనసేన రైతు భరోసా యాత్ర నిర్వహించనుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పులివెందులలో త్వరలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని, చనిపోయిన రైతులను ఆదుకుంటారని నాదెండ్ల తెలిపారు. సొంత నియోజకవర్గంలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా జగన్ పట్టించుకోవడం లేదని నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
రైతు భరోసా యాత్ర.....
ఒక్క పులివెందులలోనే 135 రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అతి త్వరలోనే పులివెందులలో రైతు భరోసా యాత్ర చేపడతామని ఆయనతెలిపారు. 135 రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందజేస్తారని నాదెండ్ల పేర్కొన్నారు.
Next Story

