Thu Mar 19 2026 13:02:02 GMT+0530 (India Standard Time)
పవన్ వాహన శ్రేణి సిద్ధం
జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటనకు కొత్త వాహనాలను సిద్ధం చేశారు. కొత్తగా ఎనిమిది స్కార్పియో వాహనాలను కొనుగోలు చేశారు.

జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటనకు కొత్త వాహనాలను సిద్ధం చేశారు. కొత్తగా ఎనిమిది స్కార్పియో వాహనాలను కొనుగోలు చేశారు. ఈ వాహనాలు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ వాహనాలను పవన్ కల్యాణ్ భద్రత సిబ్బందికి కేటాయిస్తారని తెలిసింది. వాహనాలను రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి తెచ్చారని తెలిసింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ కాకుండా ఏపీ రిజిస్ట్రేషన్ ఉండేలా జనసేన పార్టీ జాగ్రత్తలు తీసుకుంటుంది.
ప్రత్యేక బస్సు....
పవన్ కోసం ప్రత్యేకంగా బస్సును కూడా తయారు చేయిస్తున్నట్లు తెలిసింది. ఈ బస్సులో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా తీర్చి దిద్దుతున్నారు. అక్టోబరు 5వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ జిల్లాల యాత్ర ప్రారంభం కానుంది. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Next Story

