Sun Mar 15 2026 16:35:46 GMT+0530 (India Standard Time)
అలాగే వెళ్దామా..? సిద్ధమా?
జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు.

జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే మూడు రాజధానులపై ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం నిర్వాకం కారణంగా యువత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగం అధికమవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
పూటకో మాట....
వైసీపీ మంత్రులు రాజధానిపై పూటకో మాట మారుస్తున్నారన్నారు. ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని, వారికే రాజధానిపై క్లారిటీ లేదని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. రాజధాని అంశంపైనే ఎన్నికలకు వెళ్లి ప్రజల్లోనే తేల్చుకుందామన్నారు. యువతకు భవిష్యత్ లేకుండా చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాదెండ్ల అన్నారు. ఇంకా ఎన్నిరోజులు బూటకపు ప్రకటనలు చేస్తారంటూ నాదెండ్ల వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
Next Story

