Fri Mar 27 2026 10:25:35 GMT+0530 (India Standard Time)
ఈ నెల 22న జనసేన పీఏసీ భేటీ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ నెల 22వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అక్బోబరులో ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ యాత్ర పై చర్చించనున్నారని తెలిసింది. దీంతో పాటు ఇటీవల జనసేన పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహిస్తారని చెబుతున్నారు.
కీలక అంశాలపై...
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సాయం, పరిహారం అందజేయడంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చించనున్నారు. జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై డిజిటల్ ప్రచారం వంటి అంశాల పై జనం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్న ఫీడ్ బ్యాక్ పవన్ తీసుకోనున్నారు. దీంతో పాటు మరో మూడు నెలల కాలానికి జనసేన పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story

