Sun Mar 08 2026 05:30:42 GMT+0530 (India Standard Time)
వంగవీటితో నాదెండ్ల భేటీ
వంగవీటి రాధాతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు

వంగవీటి రాధాతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరిరువురు చర్చించుకున్నట్లు తెలిసింది. గత కొంత కాలంగా వంగవీటి రాధా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనను జనసేనలో చేర్చుకోవాలన్న అభిప్రాయంతో నాదెండ్ల మనోహర్ స్వయంగా వెళ్లి రాధాను కలిసినట్లు సమాచారం. ఆయన వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని జనసేన భావిస్తుంది.
టీడీపీకి దూరంగా....
వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయితే ఆయన వంగవీటి రంగా విగ్రహావిష్కరణలకు తప్ప ఎక్కడికీ బయటకు రావడం లేదు. టీడీపీ మహానాడు కార్యక్రమానికి కూడా రాధా దూరంగా ఉన్నారు. ఆదివారం మాకినేని బసవపున్నయ్య కార్యాలయంలో జనవాణి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్లిన నాదెండ్ల మనోహర్ పక్కనే ఉన్న వంగవీటి రాధా కార్యక్రమానికి వెళ్లారు.
Next Story

