Sun Mar 08 2026 04:43:53 GMT+0530 (India Standard Time)
చిన్నమ్మతో నాదెండ్ల భేటీ వెనక?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. టీడీపీతో పొత్తుపై పవన్ ప్రకటన తర్వాతతొలిసారి పురంధేశ్వరితో సమావేశం అయిన ఆయన అనేక రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈరోజు బీజేపీ సమావేశంలో పొత్తులపై నేతల నుంచి అభిప్రాయాన్ని సేకరించిన సమయంలో నాదెండ్ల భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
మర్యాదపూర్వక భేటీయే...
అయితే మనోహర్ తో భేటీ మర్యాద పూర్వక సమావేశమేనని పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి తెలిపారు. జనసేన తమ మిత్ర పక్షమేనని చెప్పారు. పార్టీ నేత శివప్రకాష్ను కలవడానికే మనోహర్ వచ్చారన్న పురంద్రీశ్వరి,పొత్తులతో పాటు పార్టీ బలోపేతంపై సమావేవంలో చర్చించామని చెప్పారు. అయితే పొత్తులపై అంతిమ నిర్ణయం అధిష్ఠానానిదేనని పురంధేశ్వరి తెలిపారు.
Next Story

