Fri Mar 20 2026 18:28:29 GMT+0530 (India Standard Time)
రైతులను కూడా ఛీటింగా?
వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి భూములను తక్కువ ధరకు కొనుగోలుచేసి అదే భూమిని జగనన్న కాలనీలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కోట్లాది రూపాయలకు ప్రభుత్వానికి అమ్ముకున్నారన్నారు. జగన్ వెంటనే దీనికి సంబంధించి రాజీనామా చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. జగన్ కు స్పందించే హృదయం లేదన్నారు.
జగనన్న కాలనీలు...
జగనన్న కాలనీలు పెద్ద ట్రాష్ అని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నెల 12 నుంచి 14 తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నేతలు జగనన్న కాలనీలను సందర్శించి అక్రమలను బయటపెడతారన్నారు. ఆ కాలనీలో ఇళ్లను ఎక్కడ నిర్మించారని ఆయన ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు.
Next Story

