Sat Dec 06 2025 08:07:00 GMT+0000 (Coordinated Universal Time)
మొదలయిన జనసేన ఆవిర్భావ సభ
జనసేన పార్టీ ఆవిర్భావ సభ కార్యక్రమాలు మొదలయ్యాయి. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి

జనసేన పార్టీ ఆవిర్భావ సభ కార్యక్రమాలు మొదలయ్యాయి. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన 9వ ఆవిర్భావ సభ జరుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలను...
ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు. కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వేదికపైకి వచ్చే అవకాశముందని పార్టీ నేతలు చెప్పారు. వేలాది మంది తరలి రావడంతో జనసేన ప్రాంగణం కిక్కిరిసి పోయింది.
Next Story

