Mon Jan 20 2025 06:01:10 GMT+0000 (Coordinated Universal Time)
Magunta meets Pavankalyan:జనసేనతో మాగుంట భేటీ... అందుకేనట
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిశారు
Magunta meets Pavankalyan:జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిశారు. ఆయన మర్యాదపూర్వకంగానే పవన్ కలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన తనయుడు రాఘవ్ రెడ్డి కూడా పవన్ ను కలిసిన వారిలో ఉన్నారు. రానున్న ఎన్నికలలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
వరప్రసాద్ కూడా...
మాగుంట వెంట ఒంగోలు టీడీపీ నేతలు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ ఉన్నారు. తిరుపతి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా ఈ రోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన బీజేపీ తరపుపున లోక్ సభ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story