Sat Mar 07 2026 19:01:33 GMT+0530 (India Standard Time)
జనసేన కీలక నిర్ణయం.. జానీ మాస్టర్‌పై నిషేధం
జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది

జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఆయన పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో ఈ మేరకు జనసేన అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది.
కేసు నమోదు కావడంతో...
ఒక మహిళ కొరియోగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో నిజానిజాలు తేలే వరకూ ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Next Story

