Sat Mar 28 2026 08:11:14 GMT+0530 (India Standard Time)
అంతక్కర్లేదు కాని .. అవి పట్టుకోండి చాలు
జనసేన అధినేత వవన్ కల్యాణ్ వైసీపీ ఎంపీల వెంట పడుతున్నారు. ఆయన తాజాగా ట్వీట్ చేశారు.

జనసేన అధినేత వవన్ కల్యాణ్ వైసీపీ ఎంపీల వెంట పడుతున్నారు. ఆయన తాజాగా ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకోవాలని పవన్ కల్యాణ్ వైసీపీ, టీడీపీ ఎంపీలకు సూచించారు. పార్లమెంటు లో విశాఖ స్టీల్ ప్లాంట్ తరుపున పోరాడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ప్లకార్డులు పట్టుకోవాలంటూ....
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలిస్తామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారని, అంతక్కర్లేదు గాని ప్లకార్డులు పట్టుకోండి చాలు అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడాలంటూ వరస ట్వీట్లతో జనసేన హోరెత్తిస్తోంది.
Next Story

