Thu Mar 19 2026 04:35:03 GMT+0530 (India Standard Time)
తీర్పు అమలయ్యేంత వరకూ పోరాడుతాం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు. రాజధాని అమరావతి అంశంపై ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. గత ఏడాదిన్నర కాలంగా న్యాయాన్నే నమ్ముకుని రైతులు ఉద్యమం చేస్తున్నామని చెప్పారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోయిందని నాదెండ్ల మనోహర్ అన్నారు.
వెంటనే పనులను...
ఇప్పటికైనా హైకోర్టు సూచించినట్లుగా మూడు నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ కోరారు. మూడు రాజధానుల బిల్లు ఇక ఏరూపంలో తెచ్చినా చెల్లదని అని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు పర్చేంత వరకూ జనసేన రైతుల పక్షాన పోరాడుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వెంటనే రాజధాని పనులను ప్రారంభించాలని ఆయన కోరారు.
Next Story

